Header Banner

కలలో నీళ్ళు కనిపిస్తే దేనికి సంకేతం! ఏమి జరుగుతుంది?

  Sat May 17, 2025 07:29        Others

మనకు రకరకాల కలలు వస్తూ ఉంటాయి. కలలలో కనిపించే కొన్ని సంఘటనలు అవి మన భవిష్యత్తును సూచిస్తాయి అని చెబుతారు. స్వప్నశాస్త్రం ప్రకారం మన జీవితంలో భవిష్యత్తులో ఎదురు కాబోయే అనేక విషయాలను స్పష్టం చేస్తాయని చెప్తారు. చాలామంది కలలో నీళ్లను చూస్తారు. కలలో నీళ్లు వస్తే ఏం జరుగుతుంది? వాటి ప్రభావం మన జీవితం మీద ఏ విధంగా ఉంటుంది? అనేది స్వప్నశాస్త్రం ప్రకారం మనం తెలుసుకుందాం.

 

కలలో నీళ్ళు ఇలా కనిపిస్తే జరిగేదిదే

కలలో ప్రశాంతమైన, స్వచ్ఛమైన నీళ్లు వస్తే అది జీవితంలో ప్రశాంతతను, శాంతిని, సంతృప్తిని సూచిస్తుంది. మీ భావోద్వేగ స్థితి కూడా ఇందులో ప్రతిబింబిస్తుంది. ప్రవహించే నీళ్లు కలలో వస్తే అది మీ జీవితంలోని మార్పులను, పురోగతిని, సాహసాలను సూచిస్తుంది. కలలో స్వచ్ఛమైన నీటిని చూస్తే వారి జీవితం మారిపోతుందని, ఉద్యోగ వ్యాపార రంగాలలో పురోగతి సాధిస్తారని దాని సంకేతం.

 

కలలో వరదనీరు, మురికినీరు కనిపిస్తే ఇలా

కలలో సముద్రపు నీరు కనిపిస్తే అశుభం జరగబోతుందని, చెడుకు సంకేతంగా దానిని చెబుతారు. కలలో వరద నీరు కనిపిస్తే అశుభమని చెబుతారు. కలలో వరద వచ్చినట్టు, వరద నీటిని చూసినట్లయితే అది మీకు భారీనష్టాన్ని కలిగిస్తుందని చెబుతారు. భవిష్యత్తులో మీ జీవితం అస్తవ్యస్తంగా మారుతుందన్న దానికి సంకేతంగా చెబుతారు. కలలో వరద నీరు, మురికి నీరు కనిపిస్తే జీవితం పరమ దరిద్రంగా మారిపోతుందని మంచి ఫలితాలు రావనే సంకేతంగా చెబుతారు.

 

ఇది కూడా చదవండి: తస్మా జాగ్రత్త.. మీకు 40 ఏళ్లు వచ్చాయా? తప్పనిసరిగా ఈ వైద్య పరీక్షలు చేయించుకోండి.. లేదంటే.!

 

కలలో తుఫాను, ఈత కొడుతున్నట్టు, మునిగిపోతున్నట్టు వస్తే జరిగేదిదే

కలలో నీరు కనిపించడం భావోద్వేగాలను ప్రభావితం చేస్తుంది. కలలో వర్షపు నీరు వస్తే మంచి జరుగుతుందని చెబుతారు. కలలో ఏదైనా తుఫాను వంటిది వచ్చి నీళ్లు కనిపిస్తే మీరు జీవితంలో ఒత్తిడి, గందరగోళానికి గురవుతున్నారని భావోద్వేగ అసంతృప్తికి దీనిని సంకేతంగా చెబుతారు. ఇక కలలో నీళ్లలో ఈత కొడుతున్నట్టు లేదా నీళ్లలో మునిగి పోతున్నట్టు వస్తే మీరు భావోద్వేగాల మధ్య నలిగి పోతున్నారని అర్థం.

 

నీళ్ళలో పడవలో వెళ్తున్నట్టు వస్తే

కలలో నీళ్లలో వెళుతున్న పడవలో ఉన్నట్టు వస్తే మీరు మీ జీవిత ప్రయాణాన్ని సాఫీగా కొనసాగిస్తున్నారని, మార్పు వైపు వెళుతున్నారని అర్థం. అయితే కలలో నీళ్లు వచ్చినప్పుడు అవి ఎలా ఉన్నాయి? అనే దానిని పరిగణలోకి తీసుకొని జాగ్రత్తగా గమనించి గుర్తించవలసి ఉంటుంది.

 

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. 

 

ఇది కూడా చదవండి: ఏపీలో వారందరికీ గుడ్ న్యూస్! చంద్రబాబు కీలక ఆదేశాలు! రూ.12,500 చొప్పున..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడవిశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #DreamMeaning #WaterInDream #DreamInterpretation #SpiritualMeaning #DreamSymbols